Road Accident : పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు కొత్తకోట సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident : పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా

road accident

Updated On : December 11, 2022 / 1:29 PM IST

road accident : వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు కొత్తకోట సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్ లో హైదరాబాద్ లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో పాలెం బ్రిడ్జి వద్ద క్రూయిజర్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

స్థానికుల సహాయంతో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.