తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు, ఏడుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 295 మంది బలి అయ్యారు. తెలంగాణలో 10,904 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 12,708 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
0 నుంచి 12 వయస్సు లోపు ఉన్న మగ పిల్లలు 640 మంది, అమ్మాయిలు 544 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు యుక్త వయసు గల వారిలో కనిపిస్తున్నాయి. 13 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నవారిలో ఎక్కువగా కేసులు కనిపిస్తున్నాయి. అందులో కూడా పురుషులు ఎక్కువగా ఉన్నారు.
60 సంవత్సరాల లోపు 13,186 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 60 ఏళ్ల లోపు ఉన్న 6905 మంది మహిళలు కరోనా బారిన పడ్డారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన మృద్ధులు మగవారు 1733 మంది ఉండగా, ఆడవాళ్లు 894 మంది ఉన్నట్లు వెల్లడించారు.
మేడ్చల్ 122, రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి 19, మహబూబ్ నగర్ 19, నల్గొండ 14, కరీంనగర్ 5 వనపర్తి, నిజామాబాద్ 3, మెదక్ 3, నిర్మల్ 2, మెదక్ 3, వికారాబాద్ 2, జనగామ 2, గద్వాల, సిరిసిల్ల, సిద్ధిపేట, వరంగల్ రూరల్, నారాయణపేట్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు అయింది.