తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 146 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,598కి చేరింది.
కరోనా నుంచి 2,94,243 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,624కు చేరింది. ప్రస్తుతం 678 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,731 ఉంది.
గత 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 29, రంగారెడ్డిలో 12, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 11, కరీంనగర్ జిల్లాలో 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయి.