Jubilee Hills Police Station : నా భార్య కనిపించడం లేదు..ఓ భార్యతో తన భర్త వెళ్లాడు, పోలీసులకు కంప్లైట్
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Jubilee Hills
Jubilee Hills Police Station :తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ…పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన బి.నారాయణ దాస్, మోనికా దాస్ దంపతులు బతుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. యూసుఫ్ గూడ సమీపంలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్నారు. నారాయణ దాస్ ప్లంబర్ గా పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ..గత కొంతకాలంగా..ఫోన్ లో ఎండీ ఆసీఫ్ తో భార్య తరచూ మాట్లాడుతున్న విషయాన్ని నారాయణ దాస్ గమనించాడు. దీంతో అతను మందలించాడు. పెద్ద మనుషుల దగ్గరకు చేరింది. దీంతో మోనికాకు సర్దిచెప్పారు.
ఇదిలా ఉంటే..ఈనెల 24వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో…మోనికా దాస్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని..కోల్ కతాకు వెళ్లిపోయింది. ఆసిఫ్ తో కలిసి వెళ్లినట్లు..పిల్లలను తల్లి దగ్గర వదిలేసి వెళ్లినట్లు భర్త నారాయణ దాస్ తెలుసుకున్నాడు. ఆదివారం జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన భర్త కనిపంచడం లేదంటూ…ఆసిఫ్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.