IPS Transfers : ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. తెలంగాణలో 20మంది ఐపీఎస్‌ల బదిలీలు

సీఐడీ అడిషనల్ డీజీపీగా శిఖా గోయల్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, పోలీస్ అకాడెమీ డైరెక్టర్ గా అభిలాశ్ బిస్తా నియమితులయ్యారు.

IPS Transfers : ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. తెలంగాణలో 20మంది ఐపీఎస్‌ల బదిలీలు

IPS Officers Transfers In Telangana

Updated On : December 20, 2023 / 12:08 AM IST

తెలంగాణలో ప్రభుత్వం మారాక అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 20 మంది ఐపీఎస్ లు బదిలీలు అయ్యారు. తెలంగాణ డీజీపీగా రవిగుప్తను కొనసాగిస్తూనే 20మంది ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించారు. సీఐడీ అడిషనల్ డీజీపీగా శిఖా గోయల్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, పోలీస్ అకాడెమీ డైరెక్టర్ గా అభిలాశ్ బిస్తా నియమితులయ్యారు.

ఐపీఎస్ ల బదిలీలు..
* తెలంగాణ డీజీపీగా రవిగుప్త కొనసాగింపు
* మాజీ డీజీపీ అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా బదిలీ
* హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ
* విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్
* తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష్ బిస్తా
* జైళ్ళశాఖ అడిషనల్ డీజీగా సౌమ్యమిశ్రా
* ఉమెన్స్ సేఫ్టీ లో ఉన్న షికా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీపీగా బదిలీ
* సీఐడీ చీఫ్ ఉన్న మహేశ్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ
* ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ
* సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఐజీపీ హోంగార్డ్స్ కు బదిలీ

Also Read : అందుకే రైతుబిడ్డకి ప్రైజ్ ఇచ్చారు.. ఇదంతా నాటకం.. బిగ్‌బాస్ పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో మరొకసారి ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

AR శ్రీనివాస్ ఏసీబి డైరెక్టర్ గా బదిలీ
సుమతి DIG గా SIB ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ
కమల్ హాసన్ రెడ్డి ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ డైరెక్టర్ గా బదిలీ
చంద్రశేఖర్ రెడ్డి IGP పర్సనల్ గా బదిలీ
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేశ్.ఎం
DIG cidగా రమేశ్ నాయుడు
సత్యనారాయణ ను కార్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ DIG గా బదిలీ
M. శ్రీనివాసులు -డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
సెంట్రల్ జోన్ డీసీపీ గా శరత్ చంద్ర పవార్ బదిలీ