తెలంగాణలో 43,780 కరోనా కేసులు.. 409 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : July 19, 2020 / 12:40 AM IST
తెలంగాణలో 43,780 కరోనా కేసులు.. 409 మంది మృతి

Updated On : July 19, 2020 / 6:32 AM IST

తెలంగాణలో కొత్తగా 1284 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 43,780కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 409 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1902 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో 12,765 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 30,607 మంది డిశ్చార్జ్ అయ్యారు. శనివారం 14,883 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 2,52,700 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 667 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి 86, రంగారెడ్డి 68, మేడ్చల్ 62 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ 58, నల్గొండ 46, వరంగల్ అర్బన్ 37, వికారాబాద్ 35 కరోనా కేసులు నమోదయ్యాయి.