Marriages: తెలంగాణలో పెళ్లి సందడి.. మే, జూన్‌లో పెళ్లికి సిద్ధమైన 50వేల జంటలు
తెలంగాణలో పెళ్లి సందడి మొదలైంది. మే, జూన్ నెలలో పెద్ద సంఖ్యలో జంటలు ఒక్కటి కాబోతున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు పెళ్లి ముహూర్తాల సమయంలో..

Marriage
Marriages: తెలంగాణలో పెళ్లి సందడి మొదలైంది. మే, జూన్ నెలలో పెద్ద సంఖ్యలో జంటలు ఒక్కటి కాబోతున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు పెళ్లి ముహూర్తాల సమయంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించడంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొందరు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వివాహ తంతును పూర్తి చేసుకున్నారు. రెండేళ్లుగా పెళ్లిళ్ల హడావుడి పెద్దగా లేకపోవటంతో ఆయా రంగాలకు చెందిన వారు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలనుసైతం ఎత్తివేయడంతో భారీ సంఖ్యలో జంటలు వివాహాలకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ నెలలోనే పలు జంటలు పెళ్లిళ్లు చేసుకోగా, మే, జూన్, జులై నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో రాష్ట్రంలో పెళ్ళిళ్ల కోలాహలం నెలకొంది.
Three Marriages : చిత్తూరులో నిత్యపెళ్లి కొడుకు.. గుట్టురట్టు చేసిన మూడో భార్య
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు లేకపోవడంతో పాటు చైత్ర, వైశాఖ మాసాల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో ఎక్కువ మంది ఈ సారి వివాహ వేడుకలకు సిద్ధమవుతున్నారు. మే, జూన్, జులై నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో 50వేల జంటలు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనట్లు ఓ సర్వే వెల్లడించింది. మేలో 02, 03, 04, 09, 10, 12, 18, 20, 21, 24, 26, 27 తేదీలు మంచిరోజులు కాగా, జూన్ నెలలో 01, 05, 06, 08, 10, 11, 14, 17, 20, 21, 22, 23 తేదీలు, జులై నెలలో 03, 06, 07, 08, 09 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ఒక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ముహార్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు. ఈ ముహూర్తాల్లో తెలంగాణలో భారీ సంఖ్యలో జంటలు వివాహాలు చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.
Woman Marries Cat : పిల్లిని పెండ్లి చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
అయితే వివాహాలకు సిద్ధమైన జంటలు, వారి కుటుంబీకులను కొత్త భయం వెంటాడుతోంది. దేశంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మాస్క్ తప్పని చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలోనూ కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. ఈ క్రమంలో ఆలస్యం చేస్తే మళ్లీ కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో మే నెలలోనే పెళ్లి తంతు పూర్తయ్యేలా అధిక శాతం మంది ముహూర్తాలు చూసుకుంటున్నారని పండితులు పేర్కొంటున్నారు.