Telangana DGP: తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజ‌నీ కుమార్.. మహేశ్ భగవత్ సహా ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎల్లుండి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో ఏసీబీ డీజీ అంజనీ కుమార్‌ ను రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మిస్తూ సర్కారు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై పలు న్యాయపర కారణాల వల్ల ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Telangana DGP: తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజ‌నీ కుమార్.. మహేశ్ భగవత్ సహా ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ

Telangana DGP

Telangana DGP: తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎల్లుండి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో ఏసీబీ డీజీ అంజనీ కుమార్‌ ను రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మిస్తూ సర్కారు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై పలు న్యాయపర కారణాల వల్ల ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మొత్తం ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీస్ క‌మిష‌న‌ర్‌ మహేశ్ భగవత్ ను సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మహేశ్ భగవత్ రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్‌ గా కొనసాగారు. రాచకొండ కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్‌ ను సర్కారు నియమించింది.

ఏసీబీ డీజీగా ర‌వి గుప్తా నియమితుడయ్యారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డీజీగా జితేంద‌ర్ ను నియమించారు. శాంతి భద్రతల అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామితుడయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.