వెంటాడిన మృత్యువు : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Vikarabad Road Accident : వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-లారీ-ఆటో ఢీకొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ముందు ఆర్టీసీ బస్సు నిలిచి ఉంది. అదే సమయంలో ఆటో ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది.
ఏడుగురు ప్రయాణికులపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న ప్రయాణికులు మృతిచెందగా లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందినవారి శరీర భాగాలు కూడా చిధ్రమై తెగిపోయాయి.
ప్రమాదానికి అతివేగమా? లేదా పొగమంచే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ చందర్ నాయక్ ఇంటి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.