Assembly Election 2023: కొడుకుపై కోపంతో నామినేషన్ వేసిన 82 ఏళ్ల వృద్ధురాలు
Old Woman Nomination: జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వాతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన గోడును వెళ్లబోసుకున్నారు.

old woman nomination
ఆమె ఓ 82 ఏళ్ల వృద్ధురాలు. ఆమె భర్త స్వాతంత్య్ర సమరయోధుడు. వారి కుమారుడు విదేశాలకు వెళ్లి వచ్చాడు. తల్లికి చెందిన స్థలాన్ని ఆమెకు తెలియకుండానే అమ్మేశాడు. దీంతో వృద్ధురాలు అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతున్నారు. న్యాయం కోసం ఏకంగా సీఎం కేసీఆర్ కు సైతం లేఖ రాశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పది మందికి తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని భావించిన వృద్ధురాలు ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు చీటి మురళీధర్ భార్య చీటి శ్యామల(82). వృద్ధురాలు చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వాతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
KA Paul : రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు నాకు ఫోన్లు చేస్తున్నారు : కేఏ పాల్
తన గోడును వెళ్లబోసుకున్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కారం కావాలని, కుమారుడిపై కోపంతో నామినేషన్ వేశానని తెలిపారు.