Judicial Remand : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడికి 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ లోని హస్తినాపురంలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి కేసులో నిందితుడు బస్వరాజుపై సెక్షన్ ఐపిసి 452, 307, 354B, 25B ఆఫ్ అమ్స్ ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Judicial Remand : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడికి 14 రోజుల రిమాండ్

Young Man

Updated On : November 11, 2021 / 4:34 PM IST

young man attack young woman : హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని హస్తినాపురంలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి కేసులో నిందితుడు బస్వరాజుపై సెక్షన్ ఐ.పి.సి 452,307,354B,25B ఆఫ్ అమ్స్ ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితునికి వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఎల్బీనగర్ పోలీసులు అతన్ని జైలుకు తరలించారు.

హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 18 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన యువతి పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా యువతి-బస్వరాజు ప్రేమించుకుంటున్నారు.

యువతి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇటీవలే యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. దీంతో యువతి ఇంటికి వెళ్లిన బస్వరాజు.. ఆమెపై దాడి చేశాడు.