Fire Broke Out : డబ్బులు అక్రమంగా తరలిస్తున్న కారులో అగ్నిప్రమాదం
కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మంటలు అదుపుచేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

fire broke out (3)
Warangal Fire Broke Out : వరంగల్ జిల్లా బొల్లికుంటలో కారులో అగ్నిప్రమాదం జరిగింది. డబ్బులు అక్రమంగా తరలిస్తున్న కారు దగ్ధమైంది. జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం బోల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో కారులో అగ్నిప్రమాదం జరిగింది. ఇంజన్ లోని కరెన్సీ కట్టలకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. ప్రమాద వశాత్తు కరెన్సీ కట్టలకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి.
కారు ఇంజన్ లో కరెన్సీ కట్టలు ఉన్నాయి. కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజన్ భాగంలో డబ్బు తరలిస్తుండగా మంటలు చెలరేగాయి. ఎన్నికల వేళ కారులో అక్రమంగా తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది.
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏపీ సచివాలయ అధికారి
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట సమీపంలోకి రాగానే కారు ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగాయి. పోలీసుల కళ్లు గప్పి కారు ఇంజన్ లో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
పోలీసులు మంటలు అదుపు చేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారు డ్రైవర్, మరో వ్యక్తి అక్కడి నుంచి పరార్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ ఏ పార్టీకి చెందినదో పోలీసులు విచారిస్తున్నారు.