Telangana Ministers : నేడు పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల భేటీ

తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి అపాయింట్‌మెంట్‌ గురించి పీయూష్‌ గోయల్‌ను అడిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు.

Telangana Ministers : నేడు పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల భేటీ

Minister

Updated On : December 21, 2021 / 7:55 AM IST

Telangana ministers meet Piyush Goyal : ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీలోనే మకాం వేసింది. రెండు రోజుల నుంచి కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం నేతలు వేచి చూస్తున్నారు. ఇవాళ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ కానున్నారు. సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో పీయూష్‌ గోయల్‌ను టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు కలిశారు.

తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి అపాయింట్‌మెంట్‌ గురించి పీయూష్‌ గోయల్‌ను అడిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు కేంద్రమంత్రి. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై రాత పూర్వక హామీ ఇవ్వాలని కోరనున్నారు తెలంగాణ నేతలు.

CM Jagan : నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన

కేంద్ర ప్రభుత్వ సాగు వ్యతిరేక విధానాల‌తో రైతాంగానికి న‌ష్టం కలుగుతోందన్నారు మంత్రులు. తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేంతవరకూ సహించేది లేదని వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖ‌రి అవలంభింస్తోందని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌ నామా నాగేశ్వర్‌రావు మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఊరూరా చావుడప్పు మోగించడంతో పాటు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం చేపట్టాయి.