ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్

గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.

ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్

Somesh Kumar Lands

Updated On : January 31, 2024 / 10:54 PM IST

Somesh Kumar : తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫార్మా సిటీ అంశం ముందే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఫార్మా సిటీకి కిలోమీటర్ దూరంలోనే 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సోమేశ్ కుమార్ రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ భూమి పక్కనే ఆయన సన్నిహిత కుటుంబానికి చెందిన 123 ఎకరాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

Also Read : ఆ ఒకే ఒక్కడు ఎవరు? బీఆర్ఎస్‎ నుంచి రాజ్యసభకు వెళ్లేది అతడేనా?

సోమేశ్ కుమార్ సన్నిహిత కుటుంబానికి ఆయన భార్య పేరు మీద వారం తేడాతోనే రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. సోమేశ్ కుమార్ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.

దాసరి రామమూర్తి, ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. వీరిని సైతం విచారించాని ఏసీబీ భావిస్తోంది. వీరికి కోకాపేటలోనూ అపార్ట్ మెంట్లు, విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. కోకాపేటలో వీరి విల్లాలకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే బహుమతిగా యాచారంలో 25 ఎకరాలు కూడా పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

Also Read : సీటు త్యాగం చేస్తారా? ప్రత్యర్థిగా మారి పోటీకి దిగుతారా? పెద్దపల్లి ఎంపీ సీటుపై బీఆర్ఎస్‎లో ఉత్కంఠ