150ఏళ్ల తర్వాత నల్లమల అడవిలో కనిపించిన అడవి దున్న.. అటవీ అధికారులు ఏం చేశారంటే?

దాదాపు 150ఏళ్ల తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

150ఏళ్ల తర్వాత నల్లమల అడవిలో కనిపించిన అడవి దున్న.. అటవీ అధికారులు ఏం చేశారంటే?

Wild Bison

Wild Bison In Nallamalla Forest : నల్లమలలో అడవి దున్న (ఇండియన్ బైసన్) ప్రత్యక్ష్యమైంది. 150 సంవత్సరాల క్రితం అదృశ్యమైన అడవి దున్న మళ్లీ నల్లమలలో కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. 1870ల్లో అదృశ్యమైన అడవి దున్ను 150 ఏళ్ల తరువాత మళ్లీ నల్లమల అడవిలో ప్రత్యక్షం కావడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. వేల కిలోమీటర్లు దాటుకొని అడవిలోకి రావడం అద్భుతం అని అటవీ అధికారులు చెప్పారు. అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పింఛన్ల పంపిణీలో అలాచేస్తే ఊరుకోం..! జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వెల్లడించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 150ఏళ్ల తరువాత నల్లమల అడవిలో అడవిదున్నను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అది అటవీ ప్రాంతంలో సురక్షితంగా ఉండేవిధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంట్లు తెలుస్తోంది. అయితే, అడవిదున్న ఒక్కటే వచ్చిందా.. ఐదారు అడవి దున్నలు వచ్చాయా అనే విషయంపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : అంతరిక్షంలోకి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం ఉందా.. ఇస్రో చీఫ్‌ ఏం చెప్పారంటే?