Jaggareddy : సోనియా గాంధీ, రాహుల్ లను కలిసాకే నా రాజీనామా నిర్ణయం గురించి చెబుతా : జగ్గారెడ్డి

సోనియా గాంధీ, రాహుల్ లను కలిసాకే నా రాజీనామా నిర్ణయం గురించి చెబుతానని జగ్గారెడ్డి తెలిపారు.

Jaggareddy : సోనియా గాంధీ, రాహుల్ లను కలిసాకే నా రాజీనామా నిర్ణయం గురించి చెబుతా : జగ్గారెడ్డి

Jaggareddy Meets Senior Congress Leaders And Activists

Updated On : February 25, 2022 / 2:55 PM IST

Jaggareddy meets senior Congress leaders and activists : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా పలువురు నేతలు, కార్యకర్తలతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు. జగ్గారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు పలుమార్లు చర్చలు జరిపినా ఆయన మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీలో కొనసాగటం ఇష్టంలేనట్లుగానే కనిపిస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి జగ్గారెడ్డి తను రాజీనామా చేయటం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నారు. కానీ తాను తీసుకునే నిర్ణయం ప్రస్తుతం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసాకే నిర్ణయం చెబుతానంటున్నారు జగ్గారెడ్డి.

కానీ పార్టీని వీడితే తాను టీఆర్ఎస్ పార్టీలో గానీ, బీజేపీ పార్టీలో గానీ చేరను అని స్పష్టంచేశారు.ఈక్రమంలో మరోసారి 25న శుక్రవారం సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. జగ్గారెడ్డిని భట్టి విక్రమార్క బుజ్జగిస్తున్నారు. అయినా జగ్గారెడ్డి మాత్రం పార్టీలో కొనసాగటం ఇష్టలేనట్లుగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో ఉన్న రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కూడా కలిసి చర్చించాక తాను రాజీనామా చేసేది లేనిది ప్రకటిస్తానని స్పష్టంచేశారు.

కానీ సంగారెడ్డి నియోజక వర్గంపై మంచి పట్టు ఉన్న జగ్గారెడ్డిని వదలుకోవటం ఇష్టంలేక సీనియర్ నేతలు ఎంతగా బుజ్జగింపులు చేస్తున్నా జగ్గారెడ్డి మాత్రం రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని జగ్గారెడ్డి 15 రోజులు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియాలను కలిసాకే తన తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.