ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి

అంతేగాక, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా..

ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy: ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలుపుతారని అన్నారు. ఆ పార్టీ నేతలతో కలిసి సొంత దుకాణం పెట్టుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అంతేగాక, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా 10 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి ఎదురుకానుందని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు.

రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినప్పటికీ కనీసం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోలేకపోయారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 12 సీట్లు గెలవబోతోందని తెలిపారు. పీసీసీ పదవి కోసం 10 మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి దగ్గర పోలికలున్నాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కాంగ్రెస్‌ను కబ్జా చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెలిపారు.

Also Read: టీడీపీలో చేరిన వైసీపీ హిందూపురం కీలక నేత