Telangana : ఏఎన్ఎంలకు ఐ ప్యాడ్‌‌లు, ఆశాలకు ఐ ఫోన్లు

ఆసుపత్రుల్లో పారిశుధ్యాన్ని అత్యంత ప్రధాన అంశంగా పరిగణించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, సాన్నాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించింది.

Telangana : ఏఎన్ఎంలకు ఐ ప్యాడ్‌‌లు, ఆశాలకు ఐ ఫోన్లు

Anm

Updated On : June 18, 2021 / 11:36 AM IST

ANMs And Asha Workers : ఆసుపత్రుల్లో పారిశుధ్యాన్ని అత్యంత ప్రధాన అంశంగా పరిగణించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, సాన్నాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించింది. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బయో మెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరిచేందుకు..ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం..బీఆర్కే భవన్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఇందులో ఉప సంఘం బాధ్యతలను తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లతో పాటు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..సోమేశ్ కుమార్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  రాష్ట్రంలో వైద్య సేవల సమాచారాన్ని..ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో భద్రపరచాలని సూచించింది.

ఇందుకోసం ఆశాలకు ఐ ఫోన్లు, ఏఎన్ఎంలకు ఐ ప్యాడ్ లు అందించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి…తక్షణమే చక్కదిద్దాలని ఉపసంఘం సూచించింది. అవసరం లేని చోట నుంచి…వైద్య శాలలను తరలించాలని కోరింది. ఈనెలాఖరు లేదా వచ్చే నెల తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి..అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.