రూపాయి పెట్టుబడి పెడితే రెడింతలిస్తామన్నారు.. రూ.30 కోట్లతో ఉడాయించారు

Another online scam in Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి.. దాదాపు రూ.30 కోట్లతో పరారయ్యారు కొందరు వ్యక్తులు. చిట్టోజి రాజేష్, తాటి గంగయ్య, వెంకటేష్, పుప్పాల శ్రీనివాస్ అనే వ్యక్తులు ఈగల్ బిట్ కాయిన్ యాడ్స్ స్టూడియో, వరల్డ్ డిజిటల్ గోల్డ్ కాయిన్ పేరుతో కంపెనీ మొదలు పెట్టారు.
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే డబ్బులు రెట్టింపు చేస్తామంటూ నమ్మబలికి.. పలువురు వ్యక్తుల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడులు పెట్టిన బాధితులు గుడ్డిగా నమ్మారు. కొత్త వారిని జాయిన్ చేస్తే కమీషన్ ఇస్తామంటూ నమ్మించి చివరికి మొత్తం డబ్బుతో ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.