Nagarjuna Sagar : నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదలకు బ్రేక్.. నిలిపి వేసిన ఏపీ ఇరిగేషన్ అధికారులు

తెలంగాణ వైపు డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే డ్యామ్ పై ఉన్న తమ బలగాలను తెలంగాణ వెనక్కి పిలిపించింది.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదలకు బ్రేక్.. నిలిపి వేసిన ఏపీ ఇరిగేషన్ అధికారులు

Nagarjuna Sagar

Nagarjuna Sagar Dam : నల్గొండ నాగార్జున సాగర్ లో ఎట్టకేలకు ఏపీ ఇరిగేషన్ అధికారులు కుడి కాలువకు నీటిని నిలిపి వేశారు. గత రాత్రి 11 గంటల సమయంలో నీటి విడుదలకు బ్రేక్ పడింది. నాగార్జున సాగర్ డ్యామ్ పై ఏపీ వైపు 13 గేట్ల వరకు యధావిధిగా బారికేడ్లు, ముళ్ల కంచె ఉన్నాయి.

డిసెంబర్ 6వ తేదీన కేంద్రంతో ఇరు రాష్ట్రాల సమావేశం జరిగే వరకు బారికేడ్లు తొలగించేది లేదని ఏపీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వైపు డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే డ్యామ్ పై ఉన్న తమ బలగాలను తెలంగాణ వెనక్కి పిలిపించింది.

Jawahar Reddy : విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

ఏపీ వైపు నిన్న శనివారం ఉదయం నుండి సీఆర్పీఎఫ్ బలగాలు రెస్ట్ రూమ్ కే పరిమితం అయ్యారు. ఏపీ పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలను డ్యామ్ పైకి అనుమతించడం లేదు.