తెల్లవారుజామున 5గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ పై ఒవైసీ సంచలన ట్వీట్

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 06:08 AM IST
తెల్లవారుజామున 5గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ పై ఒవైసీ సంచలన ట్వీట్

Updated On : January 8, 2020 / 6:08 AM IST

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో చంపడం కరెక్ట్ కాదన్నారు. అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి ఉండొచ్చు అన్నారు. కానీ ఎన్ కౌంటర్లు చేయడం దారుణం అన్నారు. సీపీ సాబ్.. కడుపులో బుల్లెట్లు దించొద్దు, ఉగ్రవాదానికి మతం లేదు..” అని ఒవైసీ ట్వీట్ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను టార్గెట్ చేస్తూ ఒవైసీ ఈ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ వేదికగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ , ఒవైసీ మధ్య వార్ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఓ నెటిజన్ చేసిన ట్వీట్. హైదరాబాద్ లోని అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జిహాదీలు పని చేస్తున్నారా? వారి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు ఏ విధంగా నిఘా పెట్టారు? అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరుణంలో.. సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ప్రశ్నిస్తూ ఈ ట్వీట్ చేశాడు. దీనికి సైబరాబాద్ పోలీసులు రిప్లయ్ ఇచ్చారు. 

”ఎస్ సార్. ఉగ్రవాదుల సమాచార సేకరణకు మా దగ్గర ప్రత్యేక వ్యవస్థ ఉంది. మమ్మల్ని అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాకు తెలపండి” అంటూ సైబరాబాద్ పోలీసులు స్పందించారు.

ఈ ట్వీట్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి తీవ్రమైన కోపం తెప్పించింది. వెంటనే సైబరాబాద్ సీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎంతమంది జిహాదీలు ఉన్నారో చెప్పండి అని సైబరాబాద్ సీపీని అడిగారు. వాళ్ల సమాచారం మీ దగ్గర ఉందా? ఏ కంపెనీలో జిహాదీలు పని చేస్తున్నారు? అని నిలదీశారు. సీపీ సాబ్.. ఉగ్రవాదానికి మతం లేదు” అంటూ ట్వీట్ చేశారు. భక్తులకు మాత్రమే సమాధానం ఇస్తారా లేక ఓ ఎంపీకి కూడా బదులిస్తారా అని ఒవైసీ అడిగారు. అంతటితో ఆగని ఒవైసీ.. ఎన్ కౌంటర్ అంశాన్ని టచ్ చేశారు. ఎన్ కౌంటర్ తప్పు అనే విధంగా మాట్లాడారు.

సైబరాబాద్ సీపీకి ఒవైసీ ప్రశ్నలు:
* హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో నిజంగా జిహాదీలు ఉన్నారా?
* సైబరాబాద్ లో ఎంతమంది జిహాదీలు ఉన్నారు? వారు ఏ కంపెనీలో పని చేస్తున్నారు?
* మీ దగ్గర జిహాదీల వివరాలు ఉంటే ఇవ్వండి
* జిహాదీలను గుర్తిస్తే అరెస్ట్ చేయండి.. కానీ ఎన్ కౌంటర్ చేయొద్దు
* ఉగ్రవాదానికి, మతానికి లింక్ పెట్టొద్దు
* ఎన్ కౌంటర్ పేరుతో చంపడం కరెక్ట్ కాదు
* ఉదయం 5గంటలకు ఎన్ కౌంటర్ చేయడం, బుల్లెట్లను కడుపులో దింపడం సరికాదు