Kompella Madhavi Latha : పోలీసు కొంపముంచిన హగ్..! మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ సస్పెండ్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది.

Kompella Madhavi Latha : పోలీసు కొంపముంచిన హగ్..! మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ సస్పెండ్

Madhavi Latha Hug Incident

Updated On : April 23, 2024 / 1:08 AM IST

Kompella Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను కౌగిలించుకున్నందుకు ఓ మహిళా ఏఎస్ఐ సస్పెండ్ అయ్యారు. సైదాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాధవీలతకు సైదాబాద్ పీఎస్ మహిళా ఏఎస్ఐ ఉమాదేవి కరచాలనం చేశారు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది. వెంటనే మహిళా ఏఎస్ఐ ఉమాదేవిని సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉండగా పార్టీ అభ్యర్థిని కౌగిలించుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ నోటీసు జారీ చేశారు.

ఉమాదేవి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. ఉమాదేవిని సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉమాదేవి బీజేపీ అభ్యర్థి మాధవీలతతో కరచాలనం చేయడమే కాకుండా ఆమెను ఆలింగనం కూడా చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్యూటీలో ఉన్న పోలీస్ ఇలా చేయడం కోడ్ విరుద్దం అంటూ యాక్షన్ తీసుకున్నారు. ఈ వీడియో గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Also Read : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్