KTR : మీ ఫ్యూచర్ సూపర్‌గా ఉంటుంది- నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ భరోసా

KTR On Government Jobs : వారితో సంతృప్తికరమైన సంభాషణ జరిగింది. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను హామీ ఇచ్చాను. ఎన్నికలు ముగిసిన వెంటనే వారి అడ్డాలో వారితో సమావేశం అవుతానని వారికి మాటిచ్చాను''.

KTR : మీ ఫ్యూచర్ సూపర్‌గా ఉంటుంది- నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ భరోసా

KTR On Government Jobs (Photo : Google)

పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు కేంద్రమైన అశోక్‌నగర్ ప్రాంతం నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎక్స్ లో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఔత్సాహికులు వచ్చి నన్ను కలిశారు, భవిష్యత్తులో ముందుకు వెళ్లడానికి ఓ నమ్మకం కోసం వారు తన దగ్గరికి వచ్చారని కేటీఆర్ వెల్లడించారు. సర్కారీ కొలువులకు ప్రిపేర్ అవుతున్న యువతకు మాది భరోసా అని కేటీఆర్ ప్రకటించారు.

Also Read : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు

”వారితో సంతృప్తికరమైన సంభాషణ జరిగింది. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను భరోసా ఇచ్చాను. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజ ఉదయమే వారి అడ్డాలో వారితో సమావేశం అవుతానని వారికి మాటిచ్చాను” అని కేటీఆర్ పేర్కొన్నారు. అశోక్ నగర్ లో పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న నిరుద్యోగులతో కేటీఆర్ చిట్ చాట్ లో పాల్గొన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే అశోక్ నగర్ లో యువతతో సమావేశం అవుతానని కేటీఆర్ తెలిపారు. అంతేకాదు డిసెంబర్ 3 తర్వాత గుడ్ న్యూస్ వింటారన్న కేటీఆర్.. అధికారంలోకి రాగానే జాబ్ కాలెండర్ విడుదల చేస్తామన్నారు. అలాగే గ్రూప్ 2 కొలువుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారాయన.

”ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాం. నోటిఫికేషన్ల ఫలితాల జారీపై ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తాం. నిరుద్యోగులకు కచ్చితంగా న్యాయం చేస్తాం” అని భరోసా ఇచ్చారు కేటీఆర్.

మంత్రి కేటీఆర్ జోరు పెంచారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించేలా వరాలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల వారిని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అని మంత్రి కేటీఆర్ జోస్యం చెబుతున్నారు. మరోసారి బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ రూ.5వేలకు పెంచుతామని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.