Karimnagar Politics : బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపెవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు

Karimnagar Political Scenario : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? ఈసారి కారు జోరు సాగేనా? హస్తవాసి మారే ఛాన్స్ ఉందా? కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?

Karimnagar Politics : బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపెవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు

Karimnagar Political Scenario

బీఆర్‌ఎస్ కంచుకోటగా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి గట్టిపోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 13 నియోజకవర్గాలకు 12 చోట్ల అలవోకగా నెగ్గిన కారు పార్టీ… ఈసారీ అదే జోరు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే హుజురాబాద్‌లో ఈటల రాజేందర్.. కోరుట్లలో అర్వింద్, కరీంనగర్‌లో బండి సంజయ్, మంథనిలో శ్రీధర్ బాబు గట్టిపోటీ ఇస్తున్నారు. అటు వరసగా ఓటమి పాలవుతూ వస్తున్న ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంటి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Also Read : కేసీఆర్ సలహా పాటించిన కాంగ్రెస్: ప్రొఫెసర్ నాగేశ్వర్

మరి ఓటర్ల అనుగ్రహం ఎవరికి? కారు జోరు ఈసారి సాగేనా ? హస్తవాసి మారే చాన్స్ ఉందా? కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? జిల్లాలోని 13 నియోజకవర్గాల నుండి పోటీలో ఉన్న 41 మంది ముఖ్యమైన అభ్యర్థుల బలాబలాలేంటి..? బ్యాటిల్ ఫీల్డ్ లో స్పెషల్ అనాలసిస్..