YSRTP : ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి

కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

YSRTP : ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి

YSRTP objection binocular symbol

YSRTP Binocular Symbol : వైఎస్ఆర్ టీపీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణ లోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. వైఎస్ఆర్ టీపీకి 119 నియోజకవర్గాలకుగానూ ఉమ్మడి గుర్తుగా బైనాక్యులర్ ను కేటాయిస్తూ గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాబట్టి తమ పార్టీకి బైనాక్యులర్ కాకుండా మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది.

B. Mohan Reddy – Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి

ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీకి కేటాయించిన బైనాక్యులర్ గుర్తును ఈసీ మార్చి వేరే గుర్తు ప్రకటిస్తుందా లేదా అదే గుర్తును కంటిన్యూ చేస్తుందా చూడాలి మరి. ఈసీ నిర్ణయంపై ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.