Bandla Ganesh: ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. యుద్ధం..: బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్

మహా కురుక్షేత్ర యుద్ధంలో విజయం మనదే.. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని బండ్ల గణేశ్ ట్వీట్లు చేశారు. ఇంకా.. తన పోటీపై..

Bandla Ganesh: ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. యుద్ధం..: బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్

Bandla Ganesh

Updated On : October 10, 2023 / 12:52 PM IST

Bandla Ganesh: తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టీ దీనిపైనే పడింది. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘దయచేసి గొడవలు పడకుండా పెద్దలందరూ కూర్చొని పార్టీకి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోండి. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. యుద్ధం ప్రారంభిద్దాం.. విజయాన్ని సొంతం చేసుకుందాం. జై కాంగ్రెస్.. కలసి ఉంటే, ఈ సారి నవంబర్ 30న జరిగే మహా కురుక్షేత్ర యుద్ధంలో విజయం మనదే. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’ అని బండ్ల గణేశ్ ట్వీట్లు చేశారు.

తాను ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యబోనని బండ్ల గణేశ్ ఇప్పటికే ప్రకటించారు. రేవంత్ రెడ్డి తనకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారని, కానీ తనకు ఈ సారి టికెట్ వద్ద అని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని దానికోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రేమకు కృతజ్ఞుడినని చెప్పారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. టీపీసీసీ త్వరలోనే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.

Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా.. పోలింగ్ కేంద్రాలు ఎన్నిఅంటే..