Telangana News: నేడు క్యాబ్, ఆటోలు బంద్.. గ్రేటర్‌లో ఆర్టీసీ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్ కు.. .

Auto And Cabs
Telangana News: రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరలు పెరుగుదలతో క్యాబ్, ఆటోలకు గిట్టుబాటు కావటం లేదని, దీనికితోడు నూతన చట్టం పేరుతో ఎడాపెడా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే నూతన మోటార్ వాహనాల చట్టం 2019ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..
ఆటోలు, క్యాబ్, లారీల డ్రైవర్లు గురువారం బంద్ పాటిస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే ముఖ్యమైన ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సుల నడుపుతుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పల్లెల్లకు రద్దీగా ఉండే రూట్లతో పాటు, జిల్లా కేంద్రాల్లో లోకల్ బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Hyderabad Auto : హైదరాబాద్‌లో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఆటోలు, క్యాబ్ లు, లారీల ఒక్కరోజు బంద్ నిర్వహణ సందర్భంగా ఐకాస కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరలతో అష్టకష్టాలు పడి వాహనాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానాల రూపంలో అదనపు భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నూతన చట్టం అమలును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గురువారం ఐకాస ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్ పోర్ట్ భవనం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేయనున్నారు.