Hyderabad Auto : హైదరాబాద్‌లో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‌లో  నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు  ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హైదరాబాద్​లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆ

Hyderabad Auto  : హైదరాబాద్‌లో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

Hyderabad Auto Rickshaw

Hyderabad Auto : హైదరాబాద్‌లో  నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు  ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హైదరాబాద్​లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు పోలీసుయంత్రాంగం రంగంలోకి దిగింది.

హైదరాబాద్​ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఉంది. రవాణా, పోలీసు  శాఖలు ఇన్నాళ్ళూ చూసీ చూడనట్టు వదిలేయటంతో తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను యథేచ్ఛగా హైదరాబాద్ నగరంలో ఆటో వాలాలు నడుపుతున్నారు.  దీంతో నగరంలో పరోక్షంగా ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యతీవ్రత పెరిగిపోతోంది.
Also Read : Vijayawada : విజయవాడ శివారులో రౌడీ షీటర్ దారుణ హత్య

వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.  ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని పోలీసులు ఆటోడ్రైవర్లకు గతంలో నిర్వహించిన అవగాహానా సదస్సులో సూచించారు.  ఇక ఈరోజునుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇతర ప్రాంతాల ఆటోలపై చర్యలు తీసుకోనున్నారు.