నేను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేను: బండి సంజయ్
తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనని బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay
తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనని బండి సంజయ్ తెలిపారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
బీజేపీలో సమష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని బండి సంజయ్ అన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కన్నా గొప్ప పదవిలో ఉన్నానని వ్యాఖ్యానించారు.
విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నా కోచ్‌ను బెదిరించారు.. భయంతో జీవిస్తున్నాం: మంచు మనోజ్