Band Sanjay : బండి సంజయ్ సంచలన నిర్ణయం? ఇక రాజకీయ సన్యాసం?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి. Bandi Sanjay

Band Sanjay : బండి సంజయ్ సంచలన నిర్ణయం? ఇక రాజకీయ సన్యాసం?

BJP Bandi Sanjay

BJP Bandi Sanjay : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో కొందరు నేతల తీరు, వారికి అధిష్టానం మద్దతుగా నిలుస్తుండటంతో ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నారు సంజయ్. రాష్ట్ర నాయకుడిని అయిన తనకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వకుండా అవమానించడమే కాకుండా.. ఎంపీలుగా ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చి అసెంబ్లీ బరి నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బండి సంజయ్. తనను అణగదొక్కేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు బండి సంజయ్.

బండిని ఎన్నికల్లో ఓడించాలని కుట్ర..
కరీంనగర్ ఎంపీగా ఉన్న తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీని కోరారు బండి సంజయ్. అయితే, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు మాత్రమే ఆ అవకాశం ఇచ్చిన బీజేపీ బండి సంజయ్ వినతిని పట్టించుకోలేదు. దీంతో తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి. ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకుని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా కొనసాగడమే బెటర్ అని భావిస్తున్నారు బండి సంజయ్.

Also Read : ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

బండి అనుచరులకు షాక్..
తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండగా తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొచ్చింది తానే అని భావిస్తున్న బండి.. అకారణంగా తనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాలో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు బండి సంజయ్.

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వేములవాడ, హుస్నాబాద్ తో పాటు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని మంథని అసెంబ్లీ టికెట్ కోసం కొందరి పేర్లను సిఫార్సు చేశారు సంజయ్. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల ప్రకటనకు ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులు లేకపోయినప్పటికీ తొలి జాబితాలో ప్రకటించకుండా తన ప్రాధాన్యం తగ్గించేలా వ్యవహరించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్.

ఈటల హవా ఎక్కువైందన్న బండి..
పార్టీలో ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హవా ఎక్కువైందని, పార్టీపై ఆధిపత్యం చలాయించేలా వ్యవహరిస్తున్న ఈటల.. తనకు చెక్ చెప్పేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుమానిస్తున్నారు బండి సంజయ్. పార్టీలో తనను తొక్కేసేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని కొంతకాలంగా అనుమానిస్తున్న బండి.. తొలి జాబితా వెల్లడి తర్వాత తన అనుమానాలను నిజం అని భావిస్తూ అలకపాన్పు ఎక్కారు.

Also Read : బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తులు.. కమలనాథుల్లో చిచ్చురాజేసిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ..

సంజయ్ అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు కరీంనగర్ లో బండిని కలిసి సముదాయిస్తున్నారు. గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరీంనగర్ వచ్చి బండిని కలిశారు. అదే విధంగా బండి అనుచరులు సైతం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు.