బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్యేకు షాకిచ్చిన కార్పొరేటర్లు

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 22 మంది కార్పొరేటర్లలలో 16మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్యేకు షాకిచ్చిన కార్పొరేటర్లు

BRS MLA Prakash Goud

Telangana Congress Party : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. అయితే, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. మళ్లీ మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

Also Read : CM Revanth Reddy : నాతో పాటు ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేటీఆర్ సూచనలతో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ప్రకాశ్ గౌడ్ మనసు మార్చుకోవడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక వాయిదా పడింది. ఇదే సమయంలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.

Also Read : Komati Reddy Venkat Reddy : భువనగిరి అంటే.. కాంగ్రెస్ కంచుకోటగా మళ్లీ నిరూపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై కొందరు కార్పొరేటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గర వ్యక్తి మహేందర్ గౌడ్ కు మేయర్ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కార్పొరేటర్లు మహేందర్ గౌడ్ పై అవిశ్వాసం పెట్టి మేయర్ కుర్చీనుంచి దించేశారు. తాజాగా, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడటంతో.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 22 మంది కార్పొరేటర్లలలో 16మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.