Bear Hulchul Karimnagar District : మానకొండూరులో ఎలుగుబంటి హల్‎చల్.. భయాందోళనలో స్థానిక ప్రజలు

కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబండి కలకలం రేపింది. స్థానికంగా చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Bear Hulchul Karimnagar District : మానకొండూరులో ఎలుగుబంటి హల్‎చల్.. భయాందోళనలో స్థానిక ప్రజలు

Bear Hulchul Karimnagar District

Updated On : February 6, 2024 / 9:46 AM IST

Bear Hulchul : కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబండి కలకలం రేపింది. స్థానికంగా చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది. వీధి కుక్కలు ఎలుగుబంటిని తరమడంతో అది పరుగులు తీసి చెట్టుపైకి వెళ్లి కూర్చుంది.

Also Read : Gadala Srinivasa Rao: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన గడల శ్రీనివాసరావు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల శాతవాహన యూనివర్శిటీలో ఎలుగబంటి హల్ చల్ చేసింది. రేకుర్తి ప్రాంతంలో ఇటీవల ఎలుగుబంటిని బంధించారు. మొలంగూరు ప్రాంతం, కరీంనగర్ లో కూడా ఎలుగుబంట్ల సంచారం కొనసాగుతుంది. తాజాగా.. కరీంనగర్ – వరంగల్ ప్రధాన రహదారిపై ఉన్నటువంటి మానకొండూరు ప్రాంతంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. చెట్టుపైకెక్కి కూర్చుంది. అది కిందికి వస్తే ఎటువైపు పరుగులు పెట్టి ఎవరిపై దాడిచేస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు దానిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్టుపై ఎలుగుబంటి ఎక్కడంతో.. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు హారన్ కొట్టకుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వల సహాయంతో లేదా మత్తు మందు ఇవ్వడం ద్వారా ఎలుగు బంటిని బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు.