Bhatti Vikramarka: కేవలం 4 నెలలు ఓపిక పట్టండి: భట్టి విక్రమార్క
స్వయంగా బైక్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణులను భట్టి విక్రమార్క ఉత్సాహపరిచారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka – Congress: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనంతరం తొలిసారి ఖమ్మం జిల్లాలోని (Khammam district) మధిర నియోజక వర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వచ్చారు. ఆయనకు ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల శివారులో మహిళలు హారతులు పట్టారు. యువజన కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
స్వయంగా బైక్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణులను భట్టి విక్రమార్క ఉత్సాహపరిచారు. ఎర్రుపాలెం మండలంలో జరుగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను తీర్చకుంటే నాలుగు నెలలు ఓపిక పట్టాలని, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.
కనీస వేతనం ఇవ్వాలని, పని సమయాలు కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని భట్టి విక్రమార్క చెప్పారు. తాను పాదయాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం దారి పొడువునా చాలా సమస్యలు చూస్తూ వచ్చానని తెలిపారు. పంచాయతీ కార్మికులు 12 రోజులుగా మీరు చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు.
తాను చాలా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించానని భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. సమస్యల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పారు.