Boora Narsaiah Goud : బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్.. ముహూర్తం ఫిక్స్

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Boora Narsaiah Goud : బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్.. ముహూర్తం ఫిక్స్

Updated On : October 16, 2022 / 10:55 PM IST

Boora Narsaiah Goud : టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇక ఈ నెల 28న హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సభ జరగనుంది.

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బూర నర్సయ్య గౌడ్ కలిశారు. నడ్డాకు శాలువా కప్పి సత్కరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరిక ఖాయమైనట్లు తెలిసింది.

టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఆ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బూర నర్సయ్య గౌడ్ రెండురోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా.. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీశ్ రెడ్డి ట్వీట్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డాతో బూర నర్సయ్య గౌడ్ ఫొటో బయటకు రావడం విశేషం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ ఆశించారు బూర నర్సయ్య గౌడ్. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన కారు దిగేశారు.

కాగా, బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2013లోనే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించినా.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఖాయం చేశారు. దీంతో బూర అసంతృప్తికి గురయ్యారు. సీఎం కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని రాజీనామా సందర్భంలో బూర అన్నారు. అభిమానం వేరు, బానిసగా ఉండటం వేరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.