IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్.. మళ్లీ తెలంగాణకే..

తనను తిరిగి తెలంగాణకే కేటాయించాలన్న ఆమ్రపాలి అభ్యర్థనను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అనుమతించింది.

IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్.. మళ్లీ తెలంగాణకే..

Updated On : June 24, 2025 / 9:23 PM IST

IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్ లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు ఆమ్రపాలి. ఏపీకి కేటాయించడాన్ని క్యాట్ లో సవాల్ చేశారు ఆమ్రపాలి. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్ లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్.. తాజాగా ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. తనను తిరిగి తెలంగాణకే కేటాయించాలన్న ఆమ్రపాలి అభ్యర్థనను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అనుమతించింది. దీంతో ఆమ్రాపాలి మళ్లీ తెలంగాణకే వెళ్లనున్నారు.

తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారుల్లో వాణీ ప్రసాద్‌, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను కేంద్రం ఏపీ క్యాడర్ కు కేటాయించింది. అటు ఏపీలో కొనసాగుతున్న సృజన, శివశంకర్, హరికిరణ్‌తో పాటు పలువురు ఐఏఎస్‌ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.

డీవోపీటీ ఆదేశాలతో ఆయా అధికారులు ఏపీలో రిపోర్ట్‌ చేశారు. ఆమ్రపాలి సైతం గతేడాది అక్టోబర్‌లో ఏపీ కేడర్‌కు వెళ్లారు. అయితే, తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆమ్రపాలి ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థించారు.

ఆమ్రపాలి గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్‌గా పనిచేశారు. డీవోపీటీ ఆదేశాలతో ఏపీకి వెళ్లిన ఆమ్రపాలిని.. పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ప్రభుత్వం నియమించింది. అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Also Read: పనిచేస్తేనే పదవులు, మరోసారి అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలి- సీఎం రేవంత్ రెడ్డి