Kasani Gnaneshwar : టీడీపీకి బిగ్ షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, చంద్రబాబు పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్స్

ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దన్నారు. దీంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. Kasani Gnaneshwar

Kasani Gnaneshwar : టీడీపీకి బిగ్ షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, చంద్రబాబు పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్స్

Kasani Gnaneshwar Resigns For TDP

Updated On : October 30, 2023 / 9:14 PM IST

Kasani Gnaneshwar Resigns For TDP : తెలంగాణలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి పంపించారు.

కార్యకర్తలకు సమాధానం చెప్పలేకనే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దన్నారు. దీంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో టీడీపీకి రాజీనామా చేసేశారు కాసాని. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేకనే రాజీనామా చేస్తున్నా.

ఈసారి 25 సీట్లలో టీడీపీ గెలిచేది..
”119 స్థానాల్లో టీడీపీ గెలవకపోయినా.. తప్పుకుండా 20 నుంచి 25 సీట్లు గెలిచేది. చంద్రబాబు జైలుకి వెళ్లాక ఏ విధంగా ఉప్పెనలా కార్యక్రమాలు జరిగాయో అంతా చూశారు. ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే. చంద్రబాబుకి ఏం బాధ ఉందో తెలియదు కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు” అని కాసాని అన్నారు.

Also Read : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు?
”ఇవాళ సాయంత్రం వరకు టీడీపీ ఆఫీసులోనే ఉన్నా. చంద్రబాబు నుంచి ఏదైనా సందేశం వస్తుందేమోనని ఎదురు చూశా. కానీ ఏమీ రాలేదు. ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు అని కార్యకర్తలు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి కదా. కేడర్ కు నేను ఏమని చెప్పాలి? పోటీ చేయకపోవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు వైఖరి తప్పు. కేడర్ ను నట్టేట ముంచడం సరికాదు. ఇన్నాళ్లు వాళ్లు కష్టపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయ పార్టీ ఎందుకు? 119 స్థానాల్లో నిలబడాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్..ఇదేమైనా బొమ్మలాటనా?
కానీ, ఎక్కడైతే మనం స్ట్రాంగ్ గా ఉన్నామో అక్కడ పోటీ చేయాలి. అసలు పోటీ చేయము అంటే ఎలా? కనీసం 25-30 సీట్లలో పోటీ చేయకుంటే ఎలా? ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు.. తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు.. మరి తెలుగుదేశం ఎక్కడికి పోయింది? మేము అడిగింది అదే. ఎవరు ఎవరితో ఫైట్ చేస్తున్నారు. ఇదేమైనా బొమ్మలాటనా? కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెబుతున్నాం. ” అని కాసాని అన్నారు.

పూర్తి స్వేచ్చ ఇస్తా అని చంద్రబాబు అన్నారు..
టీడీపీకి రాజీనామా చేస్తున్నా. టీడీపీలో జాయిన్ అయ్యి 11 నెలలైంది. టీడీపీ అట్టడుగున ఉండడంతో.. ఇంటింటి దగ్గర జెండా ఎగురవేయాలని.. బాబు పిలుపునిచ్చారు. బాబు మాట మేరకు.. జాయిన్ అయ్యా.. పూర్తి స్వేచ్ఛ ఇస్తా అన్నారు చంద్రబాబు. నేను జోక్యం చేసుకోను. ఆంధ్ర నాయకులు వచ్చారని.. ప్రజలు అనుకుంటారు.. సో.. నీ పేరుతో నడిపించు అని చంద్రబాబు అన్నారు. బాబుతో కలిసి ఐదేళ్లు పని చేశా. పార్టీని నిలబెట్టాలని, ప్రజలకు సేవ చేయాలని పార్టీ పగ్గాలను తీసుకున్నా. ఖమ్మం మీటింగ్, అన్నింట జనం స్పందన బాగుంది. కమిటీలు లేకుండా ఎలా అని కమిటీలు వేశాం. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించా.

అన్ని విషయాలు మళ్లీ చెబుతా అన్నారు..
119 నియోజకవర్గాలలో.. కొన్నింటిలో జెండా ఎగరడం లేదు, క్యాడర్ లేదు. బాబు అరెస్ట్, బెయిల్ రాకపోవడం జరిగింది. బాబును కలిశా.. ఏమైంది? 20సార్లు లోకేశ్ కి కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదు. సొంత డబ్బులతో నిలబడతాం అని నేతలు వచ్చారు. 67 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశామని చెప్పా. అయితే ఈసారి ఎన్నికల్లో నిలబడడం లేదని చెప్పారు. పోటీ లేకపోతే నన్ను ఎలా పిలిచారు? చెడ్డ పేరు ఎందుకు? అని అన్నాను. ఈ ఒక్కసారి నా మాట విను అని బాబు అన్నారు. తరువాత నీకు అన్ని విషయాలు చెబుతా అన్నారు.

కార్యకర్తలు గగ్గోలు పెట్టారు. బీ ఫామ్ ఇవ్వండని కార్యకర్తలు అడిగారు. చంద్రబాబు తన నిర్ణయం మార్చుకుంటారని సాయంత్రం వరకు చూశా. ఇక లాభం లేదని రాజీనామా చేస్తున్నా. త్వరలోనే తుది కార్యాచరణ చెబుతా.