Praneeth Rao: ఆ బీఆర్ఎస్ నేత ఎవరు? ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు అనే సమాచారంతో పాటు, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతకు ప్రణీత్ సమాచారం ఇస్తూ వచ్చాడు.

Praneeth Rao: ఆ బీఆర్ఎస్ నేత ఎవరు? ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Praneeth Rao

Praneeth Rao Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ప్రతీణ్ రావు ఉన్నాడు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది.. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల ముందు కొంత మంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. బీఆర్ ఎస్ కు చెందిన ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ప్రణీత్ రావు ఒప్పుకన్నట్లు తెలిసింది. దీంతో ఆ బీఆర్ఎస్ నేత ఎవరనే అంశంపై చర్చ జరుగుతుంది.

Also Read : Ex DSP Praneeth Rao : సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ.. సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రణీత్ రావు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేవాడినని ప్రణీత్ వెల్లడించాడు. బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఫోన్  నెంబర్లు ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చేవారని, ఎక్కువగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు అనేదానిపై దృష్టిసారించటం జరిగిందని పోలీసుల విచారణలో ప్రణీత్ తెలిపినట్లు తెలిసింది. ఓ రాత్రి 100 ఫోన్ నెంబర్లు పంపించి ట్యాపింగ్ చేయాలని బీఆర్ఎస్ నేత ఆదేశాలు ఇచ్చినట్లు, ఆయన ఆదేశాలతో ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని తిరిగి అతనికి పంపించడం జరిగిందని పోలీసుల విచారణలో ప్రణీత్ చెప్పినట్లు తెలిసింది.

Also Read : బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి? డీకే శివకుమార్‌తో మంతనాలు

రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు అనే సమాచారంతో పాటు, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతకు ప్రణీత్ సమాచారం ఇస్తూ వచ్చాడు. రేవంత్ రెడ్డి అనుచరులు, ఆయన చుట్టుపక్కల ఉన్నవారి ఫోన్లతోపాటు, రేవంత్ రెడ్డి సోదరుల ఫోన్ నెంబర్లనుసైతం ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొంతమంది మీడియా పెద్దల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు ఫోన్లో చాటింగ్ లను పోలీసులు రిట్రీవ్ చేశారు. ఫోన్లో చాటింగ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ప్రణీత్ ను విచారిస్తున్నాకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్రణీత్ రావు పోలీసుల విచారణలో చెప్పినట్లు.. ఫోన్ నెంబర్లు పంపించిన బీఆర్ఎస్ నేత ఎవరు అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది.