BJP Chief Bandi Sanjay : ఇబ్రహీంపట్నం ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలి : బండి సంజయ్
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు.

BJP chief Bandi Sanjay
BJP Chief Bandi Sanjay : ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు.
హెల్త్ డైరెక్టర్ నుంచి సీఎంవోకు, ఆరోగ్యశాఖ మంత్రికి భారీగా ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బాధ్యుడైన డీహెచ్‌నే విచారణ అధికారిగా నియమించడం దారుణమన్నారు. నలుగురు పేద మహిళలు చనిపోతే కేసీఆర్ స్పందించరా అని ప్రశ్నించారు.
ముడుపులు తీసుకున్నారు కాబట్టే డీహెచ్‌పై చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. సీఎంవోకు ముడుపులు అందకపోతే వెంటనే డీహెచ్‌ను తొలగించాలన్నారు. మంత్రి హరీశ్‌రావును కూడా బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.