BJP Final List : బీజేపీ తుది జాబితా విడుదల.. 14స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం

వనపర్తి, అలంపూర్, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామరెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.

BJP Final List : బీజేపీ తుది జాబితా విడుదల.. 14స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం

Telangana BJP Final List

Updated On : November 10, 2023 / 11:54 AM IST

BJP Candidates Final List Released : ఎటకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది. బీజేపీ అధిష్టానం 14స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శేరిలింగంపల్లి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ను గణేశ్ నారాయణ్ కు కేటాయించింది. మూడు చోట్ల అభ్యర్థులను మార్చింది. వనపర్తి, అలంపూర్, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామరెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.

బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(నవంబర్ 10)న విడుదల చేసిన ప్రకటనలో బెల్లంపల్లి నుంచి ఎమాజీ పేరు వచ్చింది కానీ, ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారని పేర్కొన్నారు.

అదేవిధంగా అలంపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి మారెమ్మ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ కొనసాగుతారని తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులను గమనించాల్సిందిగా కోరుతున్నామని పేర్కొ్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గం.. అభ్యర్థి పేరు..
బెల్లంపల్లి – శ్రీదేవి
పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్ రావు
సంగారెడ్డి – రాజేశ్వరరావు
నర్సంపేట – పుల్లారావు
దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి
నాంపల్లి – రాహుల్ చంద్ర
కంటోన్మెంట్ – గణేశ్ నారాయణ్
శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
మల్కాజ్ గిరి – రామచంద్రరావు
మేడ్చల్ – ఏనుగు సుదర్శనరెడ్డి
నాంపల్లి – రాహుల్ చంద్ర
చాంద్రాయణగుట్ట – కె.మహేందర్
మధిర – విజయరాజు
వనపర్తి – అనుజ్ఞరెడ్డి
అలంపూర్ – రాజగోపాల్