Eatala Rajender : అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, ధరణి పేరుతో భూములు లూటీ.. ఇండస్ట్రీల విషయంలో ప్రభుత్వం బ్రోకరిజం : ఈటల రాజేందర్
నిర్మల్ లో మాత్రమే కాదు.. హైదరాబాద్ లోని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కేసీఆర్ కన్నేశాడని పేర్కొన్నారు.

Eatala Rajender (1) (1)
Eatala Rajender – CM KCR : సీఎం కేసీఆర్(CM KCR)పై బీజేపీ నేత ఈటల రాజేందర్(Eatala Rajender) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) విధానాన్ని ఎండగట్టారు. అభివృద్ధి(Development), మాస్టర్ ప్లాన్ (Master Plan), ధరణి(Dharani)పేరుతో భూములు లూటీ(lands looting) చేస్తున్నారని ఆరోపించారు. పాత ఏరియాకే ఇండస్ట్రీలు రానప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్స్ ఎందుకని ప్రశ్నించారు. గ్రీన్ బెల్ట్ కింద ఉన్న భూములను 220 జీవో తెచ్చి రైతుల కళ్లల్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు.
మంచి ధర పలికే భూములు ఎవరు కొనలేని పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల కడుపుకొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరి ఇచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతుల భూములు తక్కువ ధరకు తీసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత గ్రామ భూములను రెసిడెన్షియల్ జోన్ గా ప్రకటించడం న్యాయమా అని నిలదీశారు.
గతంలో ఆందోళనలు చేస్తే వెనక్కి తగ్గి.. మళ్ళీ మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకరావడం పెద్ద కుట్ర అని అన్నారు. ప్రభుత్వం ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి కానీ, నేతలు లాభ పడటానికి కాదన్నారు. పోలీసులు విపక్షాలను ఇబ్బంది పెడుతున్న తీరు బాధాకరమని చెప్పారు. ప్రతిపక్షాలను ప్రజల పక్షంలో ఉండనీయకుండా కేసీఆర్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
నిర్మల్ లో మాత్రమే కాదు.. హైదరాబాద్ లోని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కేసీఆర్ కన్నేశాడని పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీలో అసైన్డ్ భూములు పేదలు అమ్ముకునే హక్కు ఉంటే.. తెలంగాణలో మాత్రం 5800 ఎకరాల భూములు గుంజుకున్నారని తెలిపారు.
Rahul Gandhi: నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
అభివృద్ధి పేరిట భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. నిర్మల్ ఇండస్ట్రీ కోసం గతంలో 300 ఎకరాలు కేటాయిస్తే 60 ఎకరాల్లో కూడా పరిశ్రమలు రాలేదని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మాటలు తియ్యగా ఉంటే.. చేతలు ఇబ్బందిగా ఉంటాయని చెప్పారు.
ప్రభుత్వం ఇండస్ట్రీల విషయంలో బ్రోకరిజం చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. విపక్షాలపై కేసులు పెట్టి బెదిరించడం కరెక్ట్ కాదని హితువు పలికారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఅర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామని హెచ్చరించారు. మహేశ్వర రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.