AP Jithender Reddy : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

AP Jithender Reddy : తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

AP Jithender Reddy : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

AP Jithender Reddy

Updated On : March 15, 2024 / 10:18 PM IST

AP Jithender Reddy : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పేసిన ఆయన శుక్రవారం (మార్చి 15) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

Read Also : Mlc Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక స్ట్రాటజీ అదే..! ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

ఇదిలా ఉండగా, ఏపీ జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రమ ఆయనకు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు.

జితేందర్‌కు బదులుగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణకు ఎంపీ టికెట్ కేటాయించింది. పార్టీ వైఖరిపై జితేందర్ రెడ్డి తీవ్రఅసంతృప్తి గురి అయ్యారు. అదే సమయంలో సీఎం రేవంత్ స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వనించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు.

Read Also : Congress: కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఏమేం చేసింది?