Telangana BJP: హస్తినకు తెలంగాణ కమలనాథులు

తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రత్యేక పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమవనున్నారు. సోమవారం నాటికి ఢిల్లీలో ఉండాలని ఫోన్ వచ్చింది.

Telangana BJP: హస్తినకు తెలంగాణ కమలనాథులు

Telangana Bjp

Updated On : December 20, 2021 / 8:55 AM IST

Telangana BJP: తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రత్యేక పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమవనున్నారు. సోమవారం నాటికి ఢిల్లీలో ఉండాలని ఫోన్ వచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకున్నారు బీజేపీ తెలగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు.

వీరంతా సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాకుండా డీకే అరుణతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు అమిత్ షా.

బీజేపీ నేతలు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంపై సీఎం వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు.

…………………………: ఏపీ సినిమా టికెట్లపై మరో జీవో జారీ

పరేడ్ గ్రౌండ్ లో పది లక్షల మందితో అమిత్ షాతో భారీ బహిరంగ సభకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ తర్వాత బహిరంగ సభ, బండి సంజయ్ రెండో విడత పాదయాత్రపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.