Raja Singh: ఆయనకు చెవులున్నా వినపడదు, నోరున్నా మాట్లాడరు- కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్లు
అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

Raja Singh: రాష్ట్రాభివృద్ధి కోసం కిషన్ రెడ్డి సాయం కావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పరోక్షంగా సెటైర్లు వేశారు బీజేపీ నేత, గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మీరు ఎవరిని హెల్ప్ అడుగుతున్నారో ఆయనకు చెవులు ఉన్నాయి కానీ వినపడదని, ఆయనకు నోరు ఉంది కానీ మాట్లాడరని రాజాసింగ్ కౌంటర్లు వేశారు. అలాంటి మహానుభావులను హెల్ప్ అడిగితే ఏం లాభం అంటూ తన కామెంట్లను మీడియాకు షేర్ చేశారు రాజాసింగ్. అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ గా రాజాసింగ్ వేసిన సెటైర్లపై బీజేపీలో చర్చ జరుగుతోంది.
గత కొంత కాలంగా బీజేపీకి చెందిన ముఖ్య నేతలు, రాష్ట్ర నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా సెటైర్లు వేయడం, విమర్శలు చేయడం, ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం జరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. ఇన్ డైరెక్ట్ గా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్లు వేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానని సీఎం రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డితో తనకు అనుబంధం ఉందని రేవంత్ తెలిపారు. కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఆయన సహకారం తీసుకుంటానని రేవంత్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పరోక్షంగా కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. మీరు ఎవరి సాయం తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి చెవులు ఉన్నాయి, కానీ వినపడదు. నోరు ఉంది కానీ ఆయన మాట్లాడరు. అలాంటి వ్యక్తి సాయం తీసుకుంటే మీకు అందే సాయం కూడా అలానే ఉంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు రాజాసింగ్. ఈ వ్యవహారం బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. రాజాసింగ్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిసారి రాష్ట్ర బీజేపీ నేతలపై ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? అనే డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రతీసారి ఇలా సెటైర్లు వేయడం, విమర్శలు చేయడం పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.