Eatala Rajender: వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఈటల మనసులో మాట..

అక్కడ 25ఏళ్లు సర్వీస్ చేశాను. కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను. కరీంనగర్ జిల్లా నుంచి రెండుసార్లు మంత్రిగా చేశాను.

Eatala Rajender: వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఈటల మనసులో మాట..

Updated On : November 3, 2025 / 12:41 AM IST

Eatala Rajender: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ కీలక నేత, ఎంపీ ఈటల రాజేందర్ పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు టార్గెట్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తారా? లేక ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? అసలు మీ మనసులో ఏముంది? రాజేందర్ ఇప్పుడు మల్కాజ్ గిరి నాయకుడా? హుజూరాబాద్ నాయకుడా? అన్న ప్రశ్నకు ఎంపీ ఈటల ఏమన్నారంటే..

”నా పుట్టిన గడ్డ హుజూరాబాద్. అక్కడ 25ఏళ్లు సర్వీస్ చేశాను. కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను. కరీంనగర్ జిల్లా నుంచి రెండుసార్లు మంత్రిగా చేశాను. కరీంనగర్ జిల్లాకి రెండుసార్లు అధ్యక్షుడిని. హుజురాబాద్ లో నాకుండే పరిచయాలు, మమకారం వేరే వాళ్లకు ఎలా ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వారిని గంగలో కలిపేసి వచ్చేయడం ధర్మమా?

పాతికేళ్లుగా ఆ గడ్డతో నాకున్న అనుబంధం, ప్రజలతో ఉండే మమకారం వట్టిగా పోదు. అన్ని ప్రాంతాలు నావే. జనరల్ గా మాకు తెలంగాణతో సంబంధం. మాకు ఢిల్లీతో ఏం పని? అసెంబ్లీ, తెలంగాణ మాకు ముఖ్యం. ఎప్పుడూ గెలుపే ఉంటుందా? ఒక ఓటమి అనేక రకాల తప్పిదాలను ఎత్తి చూపుతుంది. నాకు కూడా కొన్ని గుణపాఠాలు నేర్పింది. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తానా, గజ్వేల్ నుంచి పోటీ చేస్తానా అన్న దాని గురించి ఇప్పుడే ఎందుకు?” అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Also Read: కవిత పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ ఈటల రియాక్షన్ ఇదే..