Eatala Rajender: కవిత పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ ఈటల రియాక్షన్ ఇదే..
ఇన్నేళ్లుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్క పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని స్వయంగా..
Eatala Rajender: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ కీలక నేత, ఎంపీ ఈటల రాజేందర్ పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
”బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కవిత.. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీ పార్టీ పెడతామంటున్నారు. ఆమె పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది? ఆమె ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలు, రానున్న ఎన్నికలపై ఏమైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇదే..
”ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆమెకు బీసీలతో ఏం సంబంధం? కేసీఆర్ తో ఒకసారి చెడింది అంటే మళ్లీ అతకదు. నరేంద్ర ఉదంతం ఒకటి, విజయశాంతి ఉదంతం ఒకటి. ఇప్పుడు కవితది ఒకటి. రేపు ఇంకెవరు పోతారు తెలీదు. తాత్కాలికంగా అతికినట్లు కనపడ్డా తాత్కాలిక అవసరాల కోసం కలిసి ప్రయాణం చేసినా.. దీర్ఘకాలికంగా మాత్రం ప్రయాణం చేయలేరు. చారిత్రక సత్యం అది.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా.. వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రులు అవుతారు తప్ప ఇంకొక కులమాయన కానీ మరో వ్యక్తి కానీ ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు పార్టీ ఉంది. అందులో చంద్రబాబు అవుతారు, లేదా ఆయన కొడుకో, మనవడో సీఎం అవుతారు. అంతేకానీ మరొకరు సీఎం అయ్యే ఆస్కారం ఉందా?
జాతీయ పార్టీలలో కూడా ఇప్పటివరకు ఇక్కడ బీజేపీ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో మాది ఎస్సీల పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటుంది. మరి ఎందుకు 50ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రికి అర్హత లేదా? అధికారం లేనప్పుడు మాట్లాడటం వేరు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడటం వేరు.. చెప్పే మాటకి, చేసే పనికి పొంతన లేదు.
ఇన్నేళ్లుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్క పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో చెప్పారు. నూటికి నూరు శాతం సామాజిక సమతుల్యత పాటించే పార్టీ బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. ప్రజల అభిప్రాయాన్ని అర్ధం చేసుకుని ఆచరించే పార్టీ బీజేపీ” అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
Also Read: బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం కేసీఆర్..! 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ ఈటల రాజేందర్..
