JP Nadda : జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో భేటీ
JP Nadda : సంపర్క్ సే అభియాన్ లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలవనున్నారు.

JP Nadda (Photo : Twitter)
JP Nadda – Telangana Tour : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నడ్డా నాగర్ కర్నూల్ కు రానున్నారు. 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు సంపర్క్ సే అభియాన్ లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలవనున్నారు. సాయంత్రం 3 గంటలకు నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు నోవాటెల్ హోటల్ లోనే ఉంటారు. సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి నాగర్ కర్నూల్ సభకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్తారు నడ్డా.
Also Read..Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం
సాయంత్రం 4.45 నిమిషాలకు నాగర్ కర్నూల్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ లో సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.10 నిమిషాలకు నాగర్ కర్నూల్ నుంచి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6.40 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకుంటారు. సాయంత్రం 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్టు నుండి తిరువనంతపురం బయలుదేరి వెళ్తారు జేపీ నడ్డా.