నా కొడుకు తప్పు చేసుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా: షకీల్

తన కుమారుడు రాహిల్ నిజంగా తప్పు చేసివుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు.

నా కొడుకు తప్పు చేసుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా: షకీల్

Bodhan Former MLA Shakeel : కారు యాక్సిడెంట్ ఘటనలో తన కుమారుడిపై కేసులు, అరెస్ట్ గురించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు. దుబాయ్ నుంచి వీడియో విడుదల చేశారు. చేయని తప్పుకు తన కుమారుడు రాహిల్‌ను కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు తప్పు వుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానని, జూబ్లీహిల్స్ కేసులోనూ అతడి ప్రమేయం లేదని చెప్పారు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.

రాజకీయ కక్షతోనే తన కొడుకుని ఇబ్బంది పెడుతున్నారని షకీల్ ఆరోపించారు. ”ప్రగతి భవన్ దగ్గర బారికేడ్లకు కారు తగిలితే రాహిల్‌పై 21 సెక్షన్ల కేసులు పెట్టారు. కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. నా ఆరోగ్యం బాగాలేకపోయినా నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశాను.

నా కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. చంపేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరాడు. నా రాహిల్‌కి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ, సీఐ, జూబ్లీహిల్స్ సీఐ బాధ్యత వహించాలి. మాపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తాం. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంద”ని షకీల్ అన్నారు.

Also Read: పెద్దపల్లి అభ్యర్ధిని మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే?