Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.

traffic restrictions in hyderabad
Hyderabad Traffic Restrictions: గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రెండ్రోజుల పాటు ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఇవాళ (20వ తేదీ), రేపు (21వ తేదీ) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు.
♦ ఇంజన్ బౌలి, ఫలక్‌నుమా వైపు నుంచి అలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్ గంజ్ నుంచి గోశాల, మిస్రీగంజ్ వైపునకు మళ్లిస్తారు.
♦ మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి అలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను ఇంజన్ బౌలి నుంచి జహనుమా, గోశాల వైపునకు డైవర్ట్ చేస్తారు.
♦ నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజా వైపునకు వచ్చే వాహనాలను గౌలిపురా వైపునకు మళ్లిస్తారు.
♦ చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపునకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు. ఇవేకాక.. పలు రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని జోయల్ డేవిస్ తెలిపారు.
పార్కింగ్ ప్రాంతాలు..
సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయంలో జరిగే బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. షాలిబండ ప్రధాన రోడ్ పై, ఆర్యవైశ్య మందిర్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టర్మినల్, ఢిల్లీ గేట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
𝐈𝐧 𝐯𝐢𝐞𝐰 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐁𝐨𝐧𝐚𝐥𝐮 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥 𝐨𝐧 𝟐𝟎.𝟎𝟕.𝟐𝟎𝟐𝟓 & 𝟐𝟏.𝟎𝟕.𝟐𝟎𝟐𝟓 𝐭𝐡𝐞 𝐟𝐨𝐥𝐥𝐨𝐰𝐢𝐧𝐠 𝐩𝐚𝐫𝐤𝐢𝐧𝐠 𝐚𝐫𝐫𝐚𝐧𝐠𝐞𝐦𝐞𝐧𝐭𝐬 𝐚𝐫𝐞 𝐡𝐞𝐫𝐞𝐛𝐲 𝐧𝐨𝐭𝐢𝐟𝐢𝐞𝐝.
𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞𝐬 𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐟𝐫𝐨𝐦 𝐯𝐚𝐫𝐢𝐨𝐮𝐬 𝐝𝐢𝐫𝐞𝐜𝐭𝐢𝐨𝐧𝐬… https://t.co/2C6zAHlbrF pic.twitter.com/wG6TRphqqz— Hyderabad City Police (@hydcitypolice) July 18, 2025
♦ అంబర్ పేట్ మహంకాళి ఆలయ పరిసరాల్లో 20వ తేదీ ఉదయం 6గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ఉప్పల్ నుంచి చాదర్ ఘాట్, ఎంజీబీఎస్ వైపునకు వెళ్లే భారీ వాహనాలు, సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను అంబర్ పేట ప్లై ఓవర్ పైనుంచి పంపుతారు.
ఆలయానికి వెళ్లే భక్తులను గాంధీ విగ్రహం – అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ వైపు ఉన్న ఫ్లైఓవర్ కింద అనుమతించి, వారి వాహనాలను గ్రౌండ్ లోపల పార్క్ చేస్తారు. 6వ నంబర్ జంక్షన్, మూసారంబాగ్ వైపు వెళ్లే ప్రయాణికులను సీపీఎల్ అంబర్‌పేట్ – సల్ధానా గేట్ వైపు అంబర్‌పేట్ ‘టి’ జంక్షన్, అలీ కేఫ్ క్రాస్‌రోడ్స్ రోడ్ల వైపు మళ్లిస్తారు.
𝗧𝗥𝗔𝗙𝗙𝗜𝗖 𝗔𝗗𝗩𝗜𝗦𝗢𝗥𝗬
Traffic Diversions At Mahankali Temple, Amberpet, Hyderabad On 20-07-2025 From 06.00 Am To 22-07-2025 At 06.00 Am:
1. All vehicles including District buses, City buses and heavy vehicles vehicular traffic coming from Uppal intended to go towards… pic.twitter.com/bWxQb3M7s5
— Hyderabad City Police (@hydcitypolice) July 18, 2025
♦ చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ టెంపుల్ పరిసరాల్లో ఆదివారం, సోమవారం రోజుల్లో ఉదయం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు. సీతాఫల్‌మండి జంక్షన్ నుండి చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వైపు వచ్చే వాహనాలను నామలగుండు – వారసిగూడ క్రాస్‌రోడ్స్ వైపు మరియు సీతాఫమండి ‘టి’ జంక్షన్, ఓయు సిటీ రోడ్ – తార్నాక క్రాస్‌రోడ్స్ వైపు మళ్లిస్తారు. అల్లుగడబావి, సికింద్రాబాద్ నుంచి చిలకలగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సీతాఫల్మండి వైపు వచ్చే వాహనాలను పద్మారావు నగర్ టి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
Traffic Diversions In view of the Bonalu festival celebrations at Shri Katta Maisamma – Pochamma Temple, Chilkalguda on 20.07.2025 (Ghatam/ Thotela) and 21.07.2025 (Palaharambandi with Pothuraju), heavy devotee turnout is expected between 6:00 AM and 11:00 PM.
To ensure smooth… pic.twitter.com/507jSBS3CK
— Hyderabad City Police (@hydcitypolice) July 18, 2025