Tarun Chugh: బీజేపీలోకి బూర నర్సయ్య‌గౌడ్.? కీలక వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

Tarun Chugh: బీజేపీలోకి బూర నర్సయ్య‌గౌడ్.? కీలక వ్యాఖ్యలు చేసిన తరుణ్ ఛుగ్

tarun chugh

Updated On : October 14, 2022 / 8:45 PM IST

Tarun Chugh: తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు మునుగోడులో ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదేక్రమంలో ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి వచ్చేలా ముఖ్యనాయకులు పావులు కదుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది.

Himachal Assembly Polls: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున నర్సయ్యగౌడ్ టికెట్‌ను ఆశించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మాత్రం.. బూర నర్సయ్యగౌడ్‌ పేరును పరిగణలోకి తీసుకోకపోవటంతో ఆయన తీవ్ర అసంతృప్తికిగురై బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. ఆయన బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇప్పటి వరకు తనను బూర నర్సయ్యగౌడ్ కలవలేదని, అయితే, రాజకీయ క్షేత్రంలో ఏమైనా జరగొచ్చని తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీలో ఎవరు ఎప్పుడైనా చేరొచ్చని అన్నారు.