ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Leader KCR

MLA KCR Oath Ceremony : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ కారుదిగి నమ్మెదిగా నడుచుకుంటూ తన చాంబర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : Vote On Account Budget : బ‌డ్జెట్‌కు వేళాయె! ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే ప్రమాదవ శాత్తూ కేసీఆర్ గాయపడటంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకొని, శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.

Also Read : Hemant Soren Arrested: హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. బీజేపీపై రాహుల్, ఖర్గే ఫైర్

  • ఓటమి ఎరుగని నేత ..
  • కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. మరోసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించడంతో కేసీఆర్ ఎంపీగా కొనసాగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
  • 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధిస్తూ వచ్చారు. గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ
  • స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.